వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే.. మరోసారి
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాము దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో హానికరమైన పురుగులను గుర్తించిన మాస్కో అంతర్జాతీయ ఆహార నాణ్యత ప్రమాణాల సంస్థ పాక్కు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మరోసారి దిగుమతులను నిలిపివేస్తామంటూ రష్యాలోని పాక్ దౌత్య కార్యాలయనికి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకు అడ్డుకట్ట చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధరించేందుకు బియ్యం ఎగుమతిదారులందరూ తగ్గు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఆరోగ్య భద్రత, నాణ్యత ప్రమాణాల కారణాలతో 2006, 2019లో పాకిస్థాన్ నుంచి బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.






