Donald Trump : వచ్చే వారం ట్రంప్‌తో పుతిన్ భేటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) వచ్చే వారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పుతిన్ ప్రకటించారు. ఈ సమావేశానికి యూఏఈ (UAE) వేదిక కావొచ్చని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లుగా ఉక్రెయిన్ (Ukraine)తో చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా పురోగతి చూపడానికి రష్యా (Russia) కు ట్రంప్ మూడు రోజుల గడువిచ్చిన నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొంటారన్న వార్తలను పుతిన్ విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ల ఖండించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పుతిన్‌తో సమావేశం జరగడం ఇదే తొలిసారి అవుతుంది.







