Russia : ఆ హక్కు భారత్‌కు ఉంది : రష్యా

సార్వభౌమ దేశాలకు సొంత ప్రయోజనాల ప్రతిపాదికన వాణిజ్య, ఆర్థిక సహకార భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కుందని రష్యా (Russia) పేర్కొంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నం దుకు భారత్ (India)పై టారిప్‌లను మరింతగా పంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరిక నేపథ్యంలో రష్యా ఈ మేరకు స్పష్టం చేసింది. సార్వభౌమ దేశాలు తమ వాణిజ్య భాగస్వాములను, వాణిజ్య, ఆర్థిక సహకారంలో భాగస్వాములను, స్వతంత్రంగా ఎంచుకునే హక్కుంటుంది. అవి తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్యం, ఆర్థిక సహకార విధానాలను నిర్ణయించుకుంటాయి అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ (Dmitry Peshkov) పేర్కొన్నారు.