మరోసారి రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్పై
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై 188 డ్రోన్లతో విరుచుకుపడింది. రాత్రి వేళ మొత్తం 17 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడులతో పోలిస్తే ఈ సారి రికార్డు స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది. వీటిలో చాలా డ్రోన్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి కారణంగా భవనాలు, జాతీయ పవర్గ్రిడ్తో సహా కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 17 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడిరచారు. మరోవైపు సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ఉంచిన 39 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.






