రోహిత్ వద్దు రాహుల్ ముద్దు, గంభీర్ ప్లాన్ ఏంటీ…?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో జట్టు కూర్పుపై ఇప్పుడు కోచ్ గౌతం గంభీర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. కీలక స్థానాల్లో ఎవరిని ఆడించాలి అనే దానిపై గంభీర్ తర్జనభర్జన పడుతున్నాడు. ముఖ్యంగా ఓపెనర్ గా జైస్వాల్ తో పాటు ఎవరిని ఆడించాలి అనే దానిపై గంభీర్ ఒక అంచనాకు రాలేకపోతున్న్నాడు. వాస్తవానికి తొలి టెస్ట్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటె కెఎల్ రాహుల్… మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఉండేవాడు.
కాని రోహిత్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్ ను ఓపెనర్ గా పంపాడు. వాస్తవానికి ఫాంలో లేని రాహుల్ పై ఎవరికి అంచనాలు లేవు. ఆ స్థాయిలో ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. బంతికి సహకరించే పిచ్ పై బ్యాట్ తో సొగసైన ఆట తీరుతో విమర్శకుల నోళ్ళు మూయించాడు. సేనా మైదానాలు తనకు కొట్టిన పిండి అంటూ మరోసారి రుజువు చేసాడు. దీనితో రెండో టెస్ట్ కూర్పుపై గంభీర్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. రోహిత్ ఓపెనర్ గా కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దీనితో గిల్ స్థానంలో రాహుల్ ను ఆడించాలని భావిస్తున్నాడు.
లేదంటే రోహిత్ ను ఒప్పించి మిడిల్ ఆర్డర్ లో పంపే అవకాశం కూడా ఉండవచ్చు. రోహిత్ కు ఓవర్సీస్ పిచ్ లపై గొప్ప అనుభవం ఏం లేదు. అతని వ్యక్తిగత స్కోర్ 63 మాత్రమే. రాహుల్ కు సెంచరీలు బాదిన అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు సీనియర్ అయినా సరే రోహిత్ ను ఓపెనర్ స్థానం త్యాగం చేయాలని గంభీర్ కోరే అవకాశం ఉండవచ్చు. ఈ సీరీస్ విజయం భారత్ కు ఎంతో కీలకం కాబట్టి ఇప్పుడు రిస్క్ చేయవద్దని భావిస్తున్న్నారు. రెండో టెస్ట్ కు కూడా గిల్ అందుబాటులో ఉండకపోవచ్చు. దీనితో మూడో స్థానంలో అయినా రోహిత్ ను ఆడించే అవకాశం ఉండవచ్చు.






