America: అమెరికాలో ఘోర ప్రమాదం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్ (New York) కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Tourist bus) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిపడిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 1 నుంచి 74 ఏండ్ల మధ్య వయస్కులు ఉన్నారని, వారందరిని ఎయిర్ అంబులెన్స్ (Air ambulance)లో దవాఖానకు తరలించామని చెప్పారు. మృతుల్లో చిన్నారులు ఎవరూ లేదని తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారని, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆండ్రే రే అనే పోలీసు అధికారి వెల్లడించారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్ (India), చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో న్యూయార్క్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నన్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు.