అమెరికాకు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సాంకేతికంగా అణు యుద్దానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ, అందుకు తొందరపడటం లేదు. మాకు కొన్ని విధివిధానాలున్నాయి. ఈ విషయం అమెరికాకు తెలుసు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే, యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్లే. దానికి తప్పకుండా బదులిస్తాం. రష్యా`అమెరికా మధ్య సంబంధాలను వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలామంది నిపుణులు ఉన్నారు అని పుతిన్ వ్యాఖ్యానించారు.






