Putin: అలాస్కాలో ఏమైందంటే … పుతిన్
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అలాస్కా వేదికగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో జరిపిన చర్చల వివరాలను తెలిపేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఫోన్ చేశారు. మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ఇటీవల అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఆ సుంకాలను అగ్రరాజ్యం తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని మోదీతో పుతిన్ పంచుకోవడం గమనార్హం. రష్యా (Russia) అధ్యక్షుడు మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు. నా స్నేహితుడు పుతిన్ ఫోన్ చేశారు. అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలు పంచుకున్నారు అని పేర్కొన్నారు.







