ప్రత్యర్థి మృతిపై పుతిన్.. తొలి స్పందన ఇదే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతి పై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతలోనే ఆయన మరణించారన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు తర్వాత ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో లేదా ఆ వ్యక్తి తన మాటల్ని ముగించక ముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావొద్దనే షరతు విధించాను. కానీ అంతలోనే ఇలా జరిగింది అని పుతిన్ వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లలో ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి.






