Samrat Kakkeri : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ కళాకారుడు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ తబలా కళాకారుడు (Tabla artist) మృతి చెందిన ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ..అమెరికాలో మూడు రోజుల క్రితం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) కు చెందిన తబలా కళాకారుడు సామ్రాట్ కక్కేరి (Samrat Kakkeri) మృతి చెందారు. కాలిఫోర్నియా (California) లోని మిడిల్ టౌన్ సమీపంలో హార్బిన్ స్ప్రింగ్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాలిఫోర్నియాలో ఓ సంగీత కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా పోలీసులు (American police) తెలిపారు. సామ్రాట్ తబలా కళాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అమెరికన్ మహిళను వివాహం చేసుకున్న సామ్రాట్‌కు ఓ కుమార్తె ఉన్నట్లు ఆయన సమీప బంధువులు తెలిపారు.