చరిత్ర స్పష్టించిన భారత సంతతి బాలిక
చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ స్వచ్ఛంధ సంస్థ కోసం నిధులు సమీకరించేందుకు బ్రిటిష్ భారతీయ విద్యార్థిని ప్రిషా తాప్రే(16) ఇంగ్లిష్ ఛానల్‌ను ఈదారు. ఈ ఘనత సాధించిన అతిచిన్న వయస్కుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. ఆమె ఉత్తర లండన్ లోని బుషే మీడ్స్ స్కూల్లో చదువుతున్నారు. నాలుగేళ్ల శిక్షణ తరువాత గత వారం ఇంగ్లండులోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్ నేజ్ వరకు 34 కిలోమీటర్లను 11 గంటల 48 నిమిషాల్లో తాప్రే ఒంటరిగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడం విశేషం. తాప్రే తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు. ఇంగ్లిష్ ఛానల్ ఈదడం ద్వారా భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థ కోసం తాప్రే 3,700 పౌండ్లు ( రూ.4 లక్షలు) సేకరించారు. ఈ సంస్థ భారత్, యూకేలలో పిల్లలకు భోజనం అందించే లక్ష్యంతో పని చేస్తోంది.






