Narendra Modi :మరోసారి అమెరికాకు నరేంద్ర మోదీ!

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరోసారి ఆ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ (New York) వేదికగా సెప్టెంబరులో జరగనున్న ఐక్యరాజ్య సమితి 80వ సమావేశాలకు మోదీ హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలు సెప్టెంబరు 9న ప్రారంభం కానుండగా, 23-29 మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. 26న భారత ప్రభుత్వ అధిపతి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఐరాస తాత్కాలిక వక్తల జాబితా పేర్కొంది. కాగా అదే రో జు ఇజ్రాయెల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల ప్రభుత్వాధినేతలు సైతం ప్రసంగాలు చేయనున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐరాసకు చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) సహా పలు దేశాల ప్రభుత్వాధినేతలతో భారత ప్రధాని భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ట్రంప్, మోదీ భేటీకి అధికారికంగా షెడ్యూల్‌ను ఖరారు చేయించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు మొదలుపెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.