Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోడీ

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Deal) ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. “గాజాలో సంఘర్షణను (Gaza War) ముగించడానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Donald) చేసిన సమగ్ర ప్రణాళికను (Gaza Deal) మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రణాళిక పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికి శాంతి, భద్రత, దీర్ఘకాలిక, స్థిరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది” అని మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఈ ఘర్షణతో సంబంధం ఉన్న వారంతా ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) చొరవకు మద్దతు ఇచ్చి, సంఘర్షణను ముగించి శాంతిని నెలకొల్పే ప్రయత్నానికి తోడ్పడతాని తాను ఆశిస్తున్నట్లు మోడీ (PM Modi) తెలిపారు. అంతకుముందు ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాల విదేశాంగ మంత్రులు కూడా ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు విడుదల చేశారు.