Marco Rubio :అమెరికా ప్రత్యక్ష జోక్యంతోనే భారత్-పాక్ మధ్య శాంతి

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరినప్పుడు అమెరికా నేరుగా జోక్యం చేసుకొని శాంతిని పునరుద్ధరించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్-పాక్ (India-Pakistan) యుద్ధాన్ని అడ్డుకొని శాంతి నెలకొల్పారు. దీంతోపాటు కంబోడియా -థాయ్‌లాండ్, అజర్‌బైజాన్ -ఆర్మేనియా ఘర్షణలు 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా -కాంగో పోరును సైతం అపగలిగాం. అలాగే ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం అని రుబియా అన్నారు.