Sharif: భారత్- రష్యా సంబంధాలు భేష్ : షరీఫ్

భారత్ పై ఎప్పుడు విషం చిమ్మే పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ (Sharif) నోటి వెంట ఎట్టకేలకు ఓ మంచి మాట వచ్చింది. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ తెలిపారు. షాంగై సహకార సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin,) తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌తో సంబంధాల అంశం చర్చకు రాగా, ఇరుదేశాల మైత్రిని షెహబాజ్ కొనియాడారు. మాస్కోతో పాకిస్థాన్ (Pakistan) బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సుకు బాటలు వేస్తుందని అన్నారు.
పుతిన్‌ను డైనమిక్ నాయకుడిగా కొనియాడిన షరీఫ్ ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ (Japan) ను ఓడిరచి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా చైనా నిర్వహిస్తున్న భారీ ఫెరేడ్‌లో షెహబాజ్‌తో పాటు పుతిన్ పాల్గొనున్నారు. చైనా పర్యటనలో ఉన్న పుతిన్ ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌తోపాటు స్లోవేకియా ప్రధాని రోబెర్ట్ ఫిక్ తదితర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.