ఉగ్రవాదాన్ని వదిలేయలేం… పాక్ పై మండిపడిన జైశంకర్
ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలే పరిస్థితిలో భారత్ లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియస్ స్టడీస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్, చైనా చర్యలను ఖండించారు. ఒక పరిశ్రమ స్థాయిలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్ లేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి. దాని తప్పించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా, తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం అని అన్నారు.






