ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించిది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్, అతని భార్య బుష్రా బీబీలను దోషిగా తేల్చి, విధించిన 14 ఏళ్ల జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్షకు సంబంధించి వచ్చిన అప్పీళ్లను రంజాన్ తర్వాత విచారిస్తామని పేర్కొంది. అయితే ఇమ్రాన్‌ఖాన్ దంపతులు వేరే కేసుల్లో కూడా దోషులుగా ఉన్నందున జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం.






