America: పాక్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) పలు హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున భారత్-పాక్ (India-Pakistan) నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇరుదేశాల గగనతాల మూసివేత, పాక్‌లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాక్‌లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని, అమెరికా అడ్వైజరీ (America Advisory) సూచించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది.







