Narendra Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు!
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెల మధ్యలో యూరప్ (Europe) , క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ (Netherlands) దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆయన తన పర్యటనలు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.







