NRI Couple: భారత్‌కు తిరిగొచ్చేసిన ఎన్నారై దంపతులు.. హెల్త్‌కేర్ ధరలే కారణం!
అమెరికాలో 17 సంవత్సరాలు గడిపిన ఒక ఎన్నారై దంపతులు (NRI Couple).. ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సోషల్ మీడియాలో వారు వివరించారు. కవలలు ఉన్న ఈ దంపతులు.. అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ (US Healthcare System) తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. బీమా ఖర్చులు విపరీతంగా ఉండగా, వైద్య సదుపాయాల అందుబాటు చాలా కష్టంగా మారిందని ఇన్స్టాగ్రామ్ వీడియోలో వివరించారు. యూఎస్ హెల్త్‌కేర్ సిస్టమ్ గురించి వివరిస్తూ.. “బీమా సహాయం చేసే ముందు, మీరు మీ వార్షిక తగ్గింపు (Deductible) పరిమితిని దాటాలి. అంటే ప్రతి డాక్టర్ విజిట్, టెస్ట్.. ఏదైనా సరే, మీరు జేబు నుంచి డెడక్టబుల్ అయ్యే వరకు చెల్లించాలి,” అని వారు (NRI Couple) చెప్పుకొచ్చారు.
“మా విషయంలో నెలవారీ ప్రీమియంతో పాటు $14,000 వరకు జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. మా ఇద్దరి కోసమే తీసుకున్న చౌకైన ప్లాన్ కూడా నెలకు $1,600 తో పాటు $15,000 డెడక్టబుల్తో ఉంది. ఇందులో మా కవలలు లేరు. దీంతో చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా ఖరీదుగా, ఆలస్యంగా మారి.. మాపై ఒత్తిడి పెంచింది.” ఎటువంటి సహాయక వ్యవస్థ లేకపోవడం, ఖర్చులు పెరుగుతుండటంతో, హెల్త్‌కేర్ ‘అందుబాటు ధరలో’ ఉన్న భారతదేశానికి తిరిగి వచ్చేశామని ఈ కుటుంబం నిర్ణయించుకుంది. “ఇక్కడ, ఆరోగ్య సంరక్షణ ఖరీదుగా అనిపించదు. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ, సహాయక వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ మార్పు పరిపూర్ణత కోసం కాదు, ఆర్థిక భారం లేని, మానసిక ప్రశాంతత ఉన్న జీవితం కోసమే,” అని ఆ దంపతులు (NRI Couple) తెలిపారు.






