అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం ..కిమ్
అమెరికా దాని మిత్రదేశాలతో పోరాటానికి తమ అణ్వాయుధ దళాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలను రెట్టింపు చేస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిన బూనారు. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కిమ్ అమెరికాను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిశీలన జరిపినట్లు తెలిసింది. తన ప్రభుత్వ 76వ వ్యవస్థాపక వార్షికోత్సవ సందర్భంగా కిమ్ చేసిన ప్రసంగంలో అమెరికా దాని మిత్రదేశాల ద్వారా ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో తాము అణ్వాయుధ దళాన్ని, సైనిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటామని ప్రమాణం చేసినట్లు తెలిసింది.






