ప్రముఖ సైకాలజిస్ట్ డేనియల్ కానమన్ కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రకటిచింది. 1983లో సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పనిచేస్తున్నారు.ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థిక శాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. ఆయన రాసిన పుస్తకం థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కామన్ సిద్ధాంతాలు సామాజిక శాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో కానమన్ జన్మించారు.






