Nobel Prize: హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్

హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్‌జ్నా హోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి (Nobel Prize) ఎంపికయ్యారు. అపోకలిప్టిక్ భయాల మధ్య కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. నోబెల్ అవార్డ్ వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ (Alfred) నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10న ఈ బహుమతి ప్రదానం చేయనున్నారు. 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, 122మందికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు 18 మంది మహిళలు (Women) ఈ పురస్కారం అందుకున్నారు. గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (Han Kang) కు ఈ బహుమతి లభించింది.