Nobel Prize:మరియా కొరీనా మచాడో కు నోబెల్ శాంతి బహుమతి

వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) కు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి (Nobel Peace Prize) బహుమతి దక్కింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ (Nobel Committee) ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా, అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. కాగా అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.