Nikki Haley : ట్రంప్‌ను సీరియస్‌గా తీసుకోండి : భారత్‌కు నిక్కీ హేలీ సూచన

రష్యా చమురుపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభిప్రాయాన్ని తీవ్రంగా పరిగణించాలని రిపబ్లికన్ లీడర్ నిక్కీ హేలీ (Nikki Haley) భారత్‌కు సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఒక ఉత్తమమైన పరిస్కారం కోసం అమెరికా(America)తో కలిసి పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. భారత్ సరుకులపై 50 శాతం సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు మధ్య దశాబ్దాలనాటి స్నేహబంధం, సత్సంకల్పం ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నుంచి బైటపడటానికి ఒక పటిష్టమైన ప్రతిపదికనున అందిస్తుంది. ఊగిసలాడుతున్న వాణిజ్యపరమైన అభిప్రాయభేధాలు, రష్యా చమురు దిగుమతులులాంటి కీలకమైన అంశాలపై పటిష్టమైన చర్చలు జరగాలి. అలాగని మన భాగస్వామ్య లక్ష్యాలను విస్మరించరాదు. చైనాను ఎదుర్కోవడానికి భారత్ లాంటి స్నేహితుడు అమెరికా తప్పనిసరిగా ఉండాలి అని నిక్కీ హేలీ విజ్ఞప్తి చేశారు.