Asim Munir: మునీర్‌కు భారత్‌తో యుద్ధమే కావాలి: ఇమ్రాన్ ఖాన్ సోదరి షాకింగ్ కామెంట్స్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు (Asim Munir) భారత్‌తో యుద్ధం చేయాలనే కోరిక ఎక్కువగా ఉందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ ఆరోపణలు చేశారు. “జనరల్ మునీర్ ఒక చాంధసవాది. ఆయనకు భారత్‌తో యుద్ధమే కావాలి. దాన్నే ఆయన కోరుతుకుంటారు. కానీ ఇమ్రాన్ ఖాన్ అలాకాదు. ఎప్పుడూ పక్కదేశంతో శాంతియుత సంబంధాలకే ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌తో కూడా చర్చలు జరిపేందుకు సిద్ధపడ్డారు” అని తెలిపారు.
ఇమ్రాన్–మునీర్ (Asim Munir) మధ్య ఉద్రిక్తతల గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇమ్రాన్ భార్య బుష్రా బీబీపై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో అప్పటి ఐఎస్ఐ చీఫ్ మునీర్ దూకుడుగా వ్యవహరించారని, ఆ కారణంగానే ఎనిమిది నెలల్లోనే ఆయనను పదవి నుంచి తప్పించారని గుర్తుచేశారు. ఆ తర్వాత మునీర్ అధికారంలోకి రాగానే.. ఇమ్రాన్‌పై అబద్ధపు కేసులు పెట్టి జైల్లో వేశారన్నారు.
ప్రస్తుతం రావల్పిండి అదియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని ఆమె ఆరోపించారు. జైలులో మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, దీనికి మునీర్ పాలసీలే కారణమని పేర్కొన్నారు. మునీర్ ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ను జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ విడుదల కోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు.






