Mukesh Ambani: డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ముకేశ్ అంబానీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఆసియా అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) భేటీ అయ్యారు. అరబ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ ఖతారు (Qatar) చేరుకున్నారు. అగ్రరాజ్యాధినేత కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రభుత్వ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముకేశ్ అంబానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో ఆయన సమావేశమయ్యారు. విందుకు హాజరైన అంబానీని ట్రంప్ ఖతార్ ఎమిర్ సాదరంగా ఆహ్వానించారు. ఇక, రెండోసారి అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్‌ను అంబానీ కలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో 100 మందికి ఇచ్చిన ప్రత్యేక విందులో నీతా-ముకేశ్ అంబానీ(Nita-Mukesh Ambani) పాల్గొన్న సంగతి తెలిసిందే.







