America:అమెరికాలో మళ్లీ కలకలం… క్యాథలిక్ స్కూల్‌పై

అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. మిన్నెసోటా (Minnesota) రాష్ట్రం మినియాపోలిస్ (Minneapolis) నగరంలో ఓ క్యాథలిక్ పాఠశాలలోకి చొరబడ్డ నిందితుడు అక్కడి విద్యార్థుల (Students) పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8, 10 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. నిందితుడిని మిన్నెసోటాకు చెందిన రాబిన్ వెస్టమన్ (Robin Westman) గా గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. కాగా, నిందితుడు తన వద్ద ఉన్న ఆయుధాల్లో ఒక దానిపై న్యూక్ ఇండియా ( భారత్‌ను నాశనం చేయాలి) అని రాసి ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.