నాసా రాకెట్ల మిషన్ కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం
ఈ నెల 8న ఉత్తర అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మూడు సౌండింగ్ రాకెట్లను ప్రయోగించింది. ఈ మిషన్‌కు భారత సంతతికి చెందిన పరిశోధకుడు ఆరోప్ా బర్జాత్వ సారథ్యం వహించడం విశేషం. సూర్యగ్రహణం సందర్భంగా భూమి ఎగువనున్న వాతావరణ ఏవిధంగా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేయడానికి ఈ రాకెట్లను ప్రయోగించారు. ఆరోప్ా హైదరాబాద్‌లో చదువుకున్నారు. షోలాపూర్‌లోని వాల్చంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2001లో అమెరికా వెళ్లారు.






