Rohit Sharma: రోహిత్ ను టార్గెట్ చేసారు, మనోజ్ తివారి సంచలనం
టీం ఇండియాలో జరుగుతున్న మార్పులు ఒక్కొక్కటి వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli)ని జట్టు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక.. హెడ్ కోచ్ గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వినిపించాయి. ఆస్ట్రేలియా పర్యటన వాళ్ళు ఇద్దరికీ ఆఖరిది అంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి. ఈ తరుణంలో భారత జట్టులో ఫిట్నెస్ కు సంబంధించి తీసుకొస్తున్న టెస్ట్ లు వివాదాస్పాధం అవుతున్నాయి.
బ్రోంకో టెస్ట్ అనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది బోర్డు. దీనిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwari) ఆగ్రహం వ్యక్తం చేసాడు. భారత క్రికెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ రోహిత్ శర్మను జట్టుకు దూరంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డాడు. టీం ఇండియా స్త్రెంత్, కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఈ బ్రోంకో టెస్ట్, యో-యో, 2-కిలోమీటర్ల టైమ్ ట్రయల్ కు సంబంధించి ప్రస్తుత ఫిట్నెస్ బెంచ్‌మార్క్‌లకు అదనంగా తీసుకొస్తున్నారు.
క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తివారీ ఈ ఫిట్నెస్ పరీక్ష గురించి మాట్లాడాడు. ఈ పరీక్ష ఉద్దేశంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేసాడు. ముఖ్యంగా 2027 ప్రపంచ కప్ జట్టు నుంచి రోహిత్ ను తప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అభిప్రాయపడ్డాడు. 2027 ప్రపంచ కప్ కోసం ప్రణాళికల నుండి విరాట్ కోహ్లీని దూరంగా ఉంచడం చాలా కష్టమని తాను భావిస్తున్నట్టు కామెంట్ చేసాడు. అందుకే రోహిత్ శర్మను టార్గెట్ చేస్తున్నట్టు తెలిపాడు. భారత జట్టు గురించి అనేక విషయాలను గమనిస్తున్నట్టు తెలిపాడు. భవిష్యత్తులో వాళ్ళు భారత క్రికెట్ లో ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.







