Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్‌లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం

ప్రపంచమంతా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, లండన్‌లో ఆయన విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. లండన్‌లోని టవిస్టాక్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ ఘటనను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన చాలా సీగ్గుచేటు అని, గాంధీ (Mahatma Gandhi) అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణించింది. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి కేవలం మూడు రోజుల ముందు, అహింస వారసత్వంపై జరిగిన ఈ హింసాత్మక చర్యపై భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలియగానే దౌత్యవేత్తలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, విగ్రహానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు, కామ్డెన్ కౌన్సిల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ (Mahatma Gandhi) లా చదివిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్‌లో 1968లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.