US Open:యూఎస్ ఓపెన్ లో భారత అమ్మాయి సంచలనం

యూఎస్ ఓపెన్ (US Open) జూనియర్ సింగిల్స్ విభాగంలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ మాయా రాజేశ్వరన్ రేవతి (Maaya Rajeswaran Revathi) సంచలన ప్రదర్శనతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. కోయంబత్తూరు (Coimbatore) (తమిళనాడు)కు చెందిన 16 ఏండ్ల మాయా, జూనియర్ గర్ల్స్ సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో 7-6 (7/5), 6-3తో ఝాంగ్ కియాన్ వీ(Zhang Qianwei) (చైనా)ను ఓడించింది. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో మాయా బలమైన సర్వీసులతో ప్రత్యర్థిని బోల్తొ కొట్టించడమే గాక కోర్టు అంతా కలియతిరుగుతూ పాయింట్లు రాబట్టింది. ఈ కోయంబత్తూరు అమ్మాయి రఫెల్ నాదల్ అకాడమీ (స్పెయిన్‌లోని మల్లొక్ర)లో శిక్షణ పొందుతున్నది.