చంద్రయాన్ బృందానికి ప్రతిష్టాత్మక పురస్కారం
చంద్రయాన్-3 మిషన్‌ను సక్సెస్ చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సైంటిస్టుల బృందం ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని అందుకుంది. అమెరికాలో కొలరాడోకు చెందిన ఎన్జీవో సంస్థ స్పేస్ ఫౌండేషన్ ఏటా అందజేస్తున్న ఈ పురస్కారం అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రముఖమైనదిగా భావిస్తారు. కొలరాడోలోని నిర్వహించిన స్పేస్ సింపోజియం కార్యక్రమంలో ఈ అవార్డును చంద్రయాన్`3 బృందం తరపున హూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్ అందుకున్నారు. అమెరికా వ్యోమగామి జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ జ్ఞాపకార్థం స్పేస్ ఫౌండేషన్ ఈ అవార్డును ఏటా అందజేస్తున్నది.






