హమాస్ కు భారీ దెబ్బ!
ఇజ్రాయెల్ గతవారం జరిపిన దాడుల్లో హమాస్‌లో నంబర్ 3గా ఉన్న కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ప్రకటించారు. హమాస్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ అయిన ఇస్సా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించినట్లు పేర్కొన్నారు. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లను విచ్చినం చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలా మంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. మిగతా టాప్ కమాండర్లు సొరంగాల్లో దాక్కున్నారు అని సలీవాన్ వెల్లడిరచారు.






