Khamenei:ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా డిమాండ్లకు తలొగ్గం : ఖమేని

అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ (Khamenei) మరోసారి మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా (America) ప్రయత్నాలు చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడదామని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయతొల్లా స్పష్టం చేశారు. జూన్‌లో తమ అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) , అమెరికాలు దాడి చేయడం ప్రతీకార చర్యను ప్రేరేపించిందన్నారు. టెహ్రాన్‌ను అస్థిరపరిచేందుకే అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఖమేనీ ఆరోపించారు. ఇటీవల యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజు అమెరికన్ ఏజెంట్లు యూరప్ (Europe) లో భేటీ అయ్యారని, ఇరాన్‌ను తదుపరి ఏ ప్రభుత్వం పాలించాలి అనే విషయంపై చర్చించారని అన్నారు. అంతిమంగా ఇరాన్ (Iran) విధేయతగా ఉండాలి అమెరికా కోరుకుంటోందని చెప్పారు. ఇజ్రాయెల్ దాడిని ప్రస్తావించిన ఆయన ప్రభుత్వం సహా ఇరాన్ మొత్తం తమ సైన్యానికి అండగా నిలబడిరదన్నారు. ఈ క్రమంలో శత్రువులను దెబ్బతీశామన్నారు. అంతర్గత విబేధాలపై హెచ్చరించిన ఆయన విదేశీ శక్తులు రెచ్చగొడుతున్నాయన్నారు.