భారత్ కు ఓ కీలక విజయం.. మళ్లీ ఎన్నికైన
ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్కు ఓ కీలక విజయం లభించింది. 13 మంది సభ్యులుండే అంతర్జాతీయ మాదకద్రవ్య నియంత్రణ మండలి (ఐఎన్సీబీ)కి జరిగిన ఎన్నికల్లో భారత ప్రతినిధి జగజీత్ పవాడియా అత్యధిక ఓట్లతో మరోసారి గెలుపొందారు. ఆమె ఈ మండలిలో 2015 నుంచి సభ్యురాలిగా ఉన్నారు. 2021-22 కాలానికి అధ్యక్షురాలిగానూ కొనసాగారు. తాజాగా ఐఎన్సీబీలోని అయిదు స్థానాల భర్తీకి ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యూఎన్ఈసీఓఎస్ఓసీ) ఎన్నికలు నిర్వహించగా 24 మంది పోటీపడ్డారు. 53 మంది ఓటింగ్లో పాల్గొనగా విజేతలుగా నిలిచిన వారిలో అత్యధికంగా 41 ఓట్లు జగజీత్ పవాడియాకు వచ్చాయని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. తాజా ఎన్నికతో జగజీత్ పవాడియా 2025-30 కాలానికి ఐఎన్సీబీ సభ్యురాలిగా కొనసాగుతారు.






