Microsoft : మైక్రోసాఫ్ట్ క్యాంపస్ లో భారతీయ ఇంజినీర్ మృతి!

అమెరికా సిలికాన్ వ్యాలీ (Silicon Valley ) లోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఆగస్టు 19న ప్రతీక్‌పాండే (Prateik Pandey) అనే ఇంజినీర్ విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత అతడు తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసుల(Police) కథనం ప్రకారం వారికి తెల్లవారుజామున 2 గంటలకు సమాచారం వచ్చింది. అక్కడ ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు వారికి కనిపించలేదు. దీనిని అనుమానాస్పద మరణంగా భావించడం లేదని మౌంటేన్ వ్యూ పోలీసులు పేర్కొన్నారు. అతడు తరచూ ఆఫీస్‌లో లేట్‌నైట్ (Late Night) వరకు పనిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని శాంటక్లారా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్ (Microsoft ) నిరాకరించింది. ఆ సంస్థ కూడా ప్రతీక్ మరణంపై దర్యాప్తు చేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు.