కెనడాలో విషాదం.. భారతీయ బిల్డర్ ను
కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్సు కావనాగ్లో దుండగులు జరిపిన కాల్పుల్లో భారతీయ సంతతికి చెందిన నిర్మాణరంగ కంపెనీ యజమాని బూటాసింగ్ గిల్(49) మృతి చెందారు. నివాస ప్రాంతాల నడుమ జరిగిన ఈ ఘటనలో బూటాసింగ్తోపాటు మరో వ్యక్తి (57) మృతి చెందగా, ఇంకొకరు (51) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పులు ఎవరు జరిపారు. ఎందువల్ల అనే వివరాలు తెలియరాలేదు. మృతి చెందిన బూటా సింగ్కు స్థానిక పంజాబీ కుటుంబాలతో గాఢమైన అనుబంధం ఉంది. ఎవరికీ ఏ అవసరం వచ్చినా సాయం చేయడంలో ముందుండే బూటాసింగ్కు హాని తలపెట్టే ఉద్దేశం ఎవరికీ ఉంటుంది? అని నగర మాజీ కౌన్సిలర్ మొహిందర్ బంగా అన్నారు. నేను నా పిల్లలు ఇద్దరితో కలిసి నడిచి వస్తుండగా పక్కనే నిర్మాణంలో ఉన్న ప్రాంతం నుంచి కనీసం నాలుగు సార్లు కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతం నుంచి కార్మికులు పరుగులు తీయడం చూశాను అని అబ్బి సీబెన్ అనే మహిళ తెలిపింది.






