కెనడాలో భారత సంతతి దంపతులు అనుమానాస్పద మృతి
కెనడాలోని ఒంటారియా ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలను పోలీసులు పరీక్షలు జరిపి మృతులను ఆ ఇంట్లో నివాసం ఉండే రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త (47), వారి కుమార్తె మహెక్ వరికూ(16)గా నిర్థారించారు. మంటలు చెలరేగటానికి ముందుగా ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనను అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం గా భావించడం లేదని ఫైర్ అధికారులు తెలిపారు.






