Tourist visa : ఐదేళ్ల విరామం తర్వాత చైనీయులకు భారత్ పర్యాటక వీసాలు

చైనీయులకు పర్యాటక వీసా (Tourist visa )ల జారీని పున ప్రారంభిస్తున్నట్టు భారత్ (India) ప్రకటించింది. ఈ వీసాల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని బీజింగ్ (Beijing) లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనీయుల (Chinese)కు భారత్ పర్యాటక వీసాల జారీని పునరుద్ధరించింది. కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో 2020లో చైనీయులకు పర్యాటక వీసాల జారీని భారత్ నిలిపివేసింది. తర్వాత గల్వాన్ (Galvan) ఘర్షణ కారణంగా ఈ ఆంక్షలను కొనసాగించింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా తాజాగా భారత్, చైనీయులకు పర్యాటక వీసాల జారీని పున ప్రారంభించింది.