భారత్ కు మస్క్ షాక్
భారత్‌కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్‌తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నది. ఇండియా టూర్‌ను రద్దు చేసుక్ను మస్క్, హఠాత్తుగా చైనాలో తేలారు మరి. భారత్‌లో వారం, 10 రోజుల కిందటే మస్క్ పర్యటించాల్సి ఉందన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడికి రానన్న ఈ టెస్లా అధినేత ఆదివారం ఆగమేఘాల మీద పొరుగు దేశానికి వెళ్లారు. దీంతో హలో చైనా, గుడ్‌బై ఇండియా అన్న ప్రచారం జరగడం గమనార్హం. భారత్‌లో టెస్లా పెట్టుబడుల కోసం మోదీ సర్కారు నిబంధనలు, విధానాల్ని మార్చి పన్ను రాయితీలు కల్పించినా ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.






