America: ఈ వారం అమెరికాకు భారత వాణిజ్య బృందం

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా తదుపరి దశ చర్చల నిమిత్తం భారతదేశ ఉన్నతస్థాయి వాణిజ్య ప్రతినిధి బృందం ఈ వారం అమెరికాకు (America) వెళ్లనుంది. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వాణిజ్య ఒప్పందం దిశగా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించుకునేందు కు తదుపరి దశ చర్చలు జరపనున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇంధన, సాంకేతిక రంగాల్లో వాణిజ్యాన్ని విస్తరించడం తదితర అంశాలపై చర్చలు జరపనున్నట్టు తెలిపాయి. అమెరికా నుంచి మరింత సహజ వాయువును కొనుగోలు చేయాలని, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను దిగుమతి చేసుకోవాలని భారత్ (India) భావిస్తోందని ఒక అధికారి చెప్పారు. ఇరుదేశాల మధ్య చర్చలు మంచి పురోగతి సాధించాయన్నారు. రష్యా (Russia)నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్‌పై ట్రంప్ భారీ సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.