America: అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేత
అమెరికాకు అన్నిరకాల పోస్టల్ సేవలను భారత్ (India) నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్ విభాగాం వెల్లడిరచింది. ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే కస్టమ్ నిబంధనల కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 25 నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. జులై 30న అమెరికా (America) యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసుల (Postal services )కు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలను లోబడి ఉంటాయని అధికారులు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటన వచ్చింది. 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ (Gift items), లేఖలు (Letters), దస్త్రాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతోంది.







