America:అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

అమెరికా సుంకాల విధింపుపై భారత్ (India )దీటైన వ్యూహ రచన దిశగా సాగుతోంది. ఆ దేశం నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh )తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రష్యా (Russia) చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇటీవల భారత్‌పై 25 శాతం అదనపు సుంకాల భారం మోపిన సంగతి తెలిసిందే.