Preeti Patel: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది : బ్రిటన్ ఎంపీ
పహల్గాం ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ (Preeti Patel )అన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన మెరుపుదాడుల గురించి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రీతి మాట్లాడారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతిచెందినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్‌లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్న ముంబయి. ఢల్లీిలో జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుంది. బ్రిటన్, భారత్‌ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ (India )కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి అని ఆమె పిలుపునిచ్చారు.







