Peter Navarro : భారత్ పై ట్రంప్ సలహాదారు ఆరోపణలు …రష్యా చమురును

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) మరోమారు విమర్శలు గుప్పించారు. రష్యా (Russia) నుంచి ముడి చమురును చౌకగా కొని భారత్ దానిని శుద్ధి చేస్తోంది. ఆ చమురును ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎక్కువ ధరకు విక్రయించి అధిక లాభాలను గడిస్తోంది. ఈ సొమ్ములో చాలా భాగం రష్యా జేబులోకి చేరుతోంది. అందుకే ఇప్పటిదాక పుతిన్ (Putin) సేనలు ఉక్రెయిన్‌తో యుద్ధం చేయగలుగుతున్నాయి. రష్యా నుంచి చమురును కొనేందుకు అమెరికా డాలర్లనే భారత్ వినియోగిస్తోంది.రష్యా బ్లాక్ మార్కెట్ చమురును భారత విదేశాల్లో అమ్మి, నల్లధనాన్ని తెల్లగా మారుస్తోంది. ఆ ధనాన్ని పుతిన్ యుద్ధ కేంద్రానికి చేరవేసే ప్రధాన స్థావరంగా భారత్ (India) మారింది అని ఆరోపించారు.