భారత్-చైనా సాయుధ ఘర్షణకు అవకాశం : అమెరికా హెచ్చరికలు
భారత్-చైనా మధ్య సాయుధ ఘర్షణ జరిగే అవకాశాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికా చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) ముప్పు అంచనాల వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే ఇరు దేశాలు భారీ సంఖ్యలో దళాలను సరిహద్దులకు తరలించాయని పేర్కొంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. సరిహద్దు వివాదం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. 2020 తర్వాత సరిహద్దుల వద్ద చెప్పుకోదగ్గ ఘర్షణలు చోటు చేసుకోలేదు. కానీ, దళాలను మాత్రం భారీగా మోహరించారు. ఇలాంటి సమయంలో చోటు చేసుకొనే అపోహలు, తప్పుడు అంచనాలతో సాయుధ ఘర్షణ ముప్పు పొంచి ఉంది అని డీఎన్ఏ తన నివేదికలో వెల్లడిరచింది.






