Gaza : గాజా పౌరులకు అమెరికా షాక్

ఇజ్రాయెల్-హమాస్(Hamas) యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజా(Gaza) ప్రజలపై మరో పిడుగు పడిరది. ఇకపై గాజా ప్రజలకు వీసా (Visa) లు నిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం(US Government) ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేక మంది చికిత్స కోసం యూఎస్‌కు వస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక వైద్య మానవతా వీసాలను జారీ చేయడానికి ఉపయోగించే ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలు నిలిపివేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడిరచింది.
Tags