Gaza: గాజాకు తక్షణమే సాయం అందాల్సిందే .. అమెరికా కాంగ్రెస్ సభ్యులు
                                    ఆకలితో ప్రాణాలు కోల్పోతున్న గాజా (Gaza) ప్రజలకు తక్షణమే ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలను అందించాలని అమెరికా ప్రతినిధి సభలోని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. గాజాకు అత్యవసర సామగ్రి అందకుండా ఇజ్రాయిల్ (Israel) దిగ్బంధనం చేయడాన్ని కొందరు తీవ్రంగా నిరసించారు. అమెరికా (America), ఇజ్రాయిల్ మద్దతుతో నడుస్తున్న జిహెచ్ఎఫ్ ఆహార పంపిణీ కేంద్రాల వద్ద సాయం కోసం ఎదురుచూస్తూ వెయ్యి మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) గాజాను నిర్మూలించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రోగ్రెసివ్ సెనెటర్ బెర్నీ సాండర్స్ (Bernie Sanders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాస్తవం. తీవ్రవాద ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల మంది పాలస్తీనియన్లను చంపడమో గాయపరచమో చేసింది. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. గాజాను తుడిచిపెట్టడానికి ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆకలిని వాడుకుంటోంది అని విమర్శించారు.







