Shreyas Iyer: అయ్యర్ ను ఇబ్బంది పెడుతోన్న గంభీర్..?

భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు నెలకొన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohith sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం పై అభిమానులు ఎన్నో విమర్శలు చేశారు. అంతర్గత రాజకీయాల కారణంగానే వీరు టెస్టు క్రికెట్ ఆడటం లేదు అనే విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరి కొంతమంది ఆటగాళ్ల విషయంలో కూడా గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ పాత్రలో ఉండి రాజకీయాలు చేస్తున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2024లో కలకత్తా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించి జట్టుకు కప్పు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ విషయంలో గంభీర్ అప్పటినుంచి కాస్త తేడా గానే ఉన్నాడు అనే విమర్శలు వచ్చాయి. 2025 ఐపీఎల్ సీజన్ కు ముందు అతన్ని కేకేఆర్ పక్కన పెట్టింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు భారీ ధరకు అయ్యర్ ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు సైతం అప్పగించింది. కానీ జాతీయ జట్టులోకి వచ్చే విషయంలో మాత్రం అతను ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఐపీఎల్ లో ఆటగాడిగా కెప్టెన్ గా అతను ఎంతగానో రాణించాడు.
కెప్టెన్సీ విషయంలో దేశవాళీ క్రికెట్లో అతను చాలామంది ఆటగాళ్ల కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు. అయినా సరే టెస్ట్ క్రికెట్లోకి అతన్ని తీసుకోలేదు. ఇక త్వరలో జరగబోయే ఆసియా కప్ విషయంలో కూడా అతనిని పక్కన పెట్టారు. యువ ఆటగాళ్లకు అవకాశం పేరుతో అయ్యర్ కు ఆసియా కప్ లో చోటు కల్పించలేదు. దీనిపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంభీర్ తో ఉన్న విభేదాలు కారణంగానే అతని కెరీర్ ను నాశనం చేస్తున్నారని, ఈ విషయంలో బోర్డు పెద్దలు పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. గంభీర్ కోచ్ గా ఉన్నన్ని రోజులు అయ్యర్ జట్టులోకి రావడం కష్టమేనంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీలో అయ్యర్ మెరుగ్గా రాణించాడు. కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్ లాడాడు. కాబట్టి అతనికి టి20 జట్టులో కూడా చోటు కల్పించాలి అనే డిమాండ్లు వినపడుతున్నాయి.